President Message 2024

Vani Singirikonda
NYTTA President,
Karya Varga Sabhyulu - 2024.

Dear Friends, 

Greetings to all members of the New York Telangana Telugu Association. Wishing everyone a happy New Year and prosperous Sankranti. I am honored to serve as the president of New York Telangana Telugu Association ( NYTTA ) for the year 2024. I am committed to promoting Telangana culture and traditions, organizing programs to enrich the knowledge of students and children, youth, men and women alike and highlighting the distinctiveness and the splendor and grandeur of our motherland. 

My main goal is to uphold the responsibilities of the president position, steer the New York Telangana Telugu Association towards its key objectives. I am dedicated to fulfill our community’s mission by collaborating with local and national organizations in service programs. 

We aim to establish a strong presence in all our endeavors, with unwavering support from our Telugu community. Trusting in our collective strength, I am confident that we will successfully execute our programs and achieve victory in every undertaking. My motto as president of NYTTA is to inspire and instill core Telangana culture and to pass on deep seated values in kids, youth and all connoisseurs of Telangana and Telugu language.

Thanks and Regards
Vani Singirikonda
President 2024
New York Telangana Telugu Association

అందరికీ నమస్కారం
నా పేరు వాణి సింగిరికొండ. ముందుగా న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం సభ్యులందరికీ, పెద్దలకి మరియు దాతలకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇటీవలే న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘానికి నాలుగవ అధ్యక్షురాలిగా బాధ్యతలు  స్వీకరించాను. నైటా ఆశయాలను ఆదర్శాలను మరింత ముందుకు తీసుకు వెళ్లడానికి నా శాయశక్తుల కృషి చేస్తాను.

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలను కళలను ప్రోత్సహిస్తూ, విద్యార్థులు మరియు పిల్లల కోసం వారి జ్ఞానాన్ని పెంచే కార్యక్రమాలను నిర్వహిస్తూ మన మాతృభూమి యొక్క విశిష్టతను తెలియజేయాలని నా ప్రధాన కోరిక.

ఇందుకోసం నా అధ్యక్ష పదవి యొక్క బాధ్యతలను త్రికరణశుద్ధిగా నిర్వహిస్తూ, నా సహచర కార్యవర్గ సభ్యుల సలహాలు సూచనలను తీసుకుంటూ  న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం ధ్యేయాన్ని ముందుకు తీసుకు వెళుతూ, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తానని  ప్రమాణం చేస్తున్నాను.  మన తెలుగు కమ్యూనిటీ కి సేవలందించే కార్యక్రమలలో మన స్థానిక, జాతీయ సంస్థలందరితో కలిసి పనిచేస్తాను.  

తెలంగాణ తెలుగు సంఘం ద్వారా మేము తలపెట్టబోవు అన్ని కార్యక్రమాలలో మన తెలుగు కమ్యూనిటీ మద్దతు ఎల్లవేళలా మాకు ఉంటుందని విశ్వసిస్తూ, మేము నిర్వహించబోవు కార్యక్రమాలలో అందరూ తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలని మా విన్నపం.

ఇట్లు

వాణి సింగిరికొండ
అధ్యక్షురాలు మరియు కార్యవర్గ సభ్యురాలు 2024
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA)

Sunil Reddy Gaddam
NYTTA President,
Karya Varga Sabhyulu - 2023.

అందరికి నమస్కారం,

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం సభ్యులకు మరియు శ్రేయోభిలాషులకు నమస్కారము. మా నూతన కార్యవర్గ బృందం 2023 తరపున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.

సంస్థ స్థాపించబడిన రెండవ సంవత్సరములోనే సంఘం అధ్యక్షునిగా నన్ను ఎన్నుకొని నామీద ఉంచిన ఈ గురుతర బాధ్యతను నాకు కలిగిన అదృష్టంగా భావిస్తూ నా సహచర కార్యవర్గ సభ్యుల సహాయ సహాకారాలలో మీ అందరి ఆదరాభిమానముల పొందటానికి శాయశక్తుల కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను.

తెలంగాణ చరిత్ర, కళలు, సంస్కృతిని కాపాడుకుంటూ ఈ వారసత్వ సంపదను భవిష్యత్తు తరాలకు అందించాలనే సంకల్పంతో స్థాపించబడిన ఈ సంస్థ యొక్క ధ్యేయాల్ని ముందుకు తీసుకుపోయేలా తదనుగుణంగా మంచి మంచి కార్యక్రమములతో ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను.

ఏ కార్యక్రమమైనా విజయవంతంగా జరగటానికి అంగబలం, అర్థబలం రెండూ అవసరం. సంస్థ స్థాపన నుండి సహృదయంతో ఆర్ధిక సహాయం అందించిన దాతలందరికి ప్రత్యేక ధన్యవాదములు. అలాగే మీ యెక్క సహాయ సహాకారాలు మా 2023 నూతన కార్యవర్గానికి కూడా అందిస్తారని ఆశిస్తున్నాము.

మీ
సునీల్ రెడ్డి గడ్డం
అధ్యక్షులు మరియు
కార్యవర్గ సభ్యులు 2023