President Message 2021

Rama Kumari Vanama 2021 NYTTA President

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం సభ్యులకు, శ్రేయోభిలాషులకు, పెద్దలకు నా నమస్కారములు, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు…

తెలంగాణ సంస్కృతి మరియు, మన జన్మభూమిని మర్చిపోకుండా, ఘనమైన చారిత్రాత్మక, సాహిత్య, వారసత్వ సంపదను భావితరాలకు అందించడానికి ఏర్పడిన ఈ న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం నూతన అధ్యక్షురాలిగా ఎన్నికై, మీ అందరికి సేవ చేసే భాగ్యం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

నా ఈ అధ్యక్ష బాధ్యతని, నా సహచర కార్యవర్గ సభ్యుల సహాయ సహకారాలతో, విశిష్టమైన తెలంగాణా సౌరభం ఉట్టిపడేలా మహిళలకు, యువతకు, పిల్లలకు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమాలతోపాటు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ, మన స్థానిక, జాతీయ తెలుగు సంఘాలతో కలిసి పని చేస్తూ, ఈ సంఘం యొక్క ఉనికిని, ప్రత్యేకతని, కాపాడుతూ, మన తెలుగు ప్రజలందరం ఒక్కటేనని చాటుతూ, మంచి మంచి సాహితీ మరియు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతామని తెలియచేస్తున్నాను.

ఈ సంఘం విజయవంతంగా నడవడానికి సహకరించే ప్రతి సభ్యునికి, దాతలకు ధన్యవాదములు తెలియచేస్తూ, ఈ సంఘ లక్ష్య సాధనలో మీ అందరి నిండైన సహకారాన్ని అభ్యర్థిస్తున్నాను.