• Home
    FACE YOGA on 07th January 2024.
  • BHOGIPALLU FOR KIDS
    on 14th January 2024.
  • KIDS COMPETITIONS & REPUBLIC DAY
    on 28th January 2024.

President Message

అందరికీ నమస్తే. నేను వాణి రెడ్డి ఏనుగు,

మీ అందరి సహకారం, ప్రోత్సాహంతో ఇటీవలే న్యూయార్క్‌ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నా, నాతో పాటు బాధ్యతలు చేపట్టిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు, సహకరించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదములు. వ్యక్తులుగా మనం వేరైనా నైటా అనే సామాజిక వేదిక మనందిరినీ ఒకే చోటకు చేర్చి ఒక వసుదైక కుటుంబంలా మార్చింది. నిత్య జీవిత హడావిడి, ఒత్తిడుల నుంచి ఉపశమనం కల్పిస్తూ వీలున్న అన్ని సందర్భాల్లో మనం కలిసి వేడుకలు, కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం.

వృత్తి, ఉద్యోగాల కోసం మనం పుట్టినగడ్డను విడిచి, అమెరికాలో స్థిరపడ్డాం. అయినా మాతృభూమితో మన పేగు బంధం కొనసాగుతూనే ఉంటుంది. మన సంస్కృతీ సంప్రదాయాలను మన పిల్లలకు, రానున్నతరాలకు అందించేందుకు నైటా మనకు మంచి వేదిక. ఇందుకు అందరి సంపూర్ణ భాగస్వామ్యమే పునాది. తెలుగు, తెలంగాణ పండగలు, వేడుకలను జరుపుకుంటూనే మన సంఘం ప్రధాన లక్ష్యాలైన సేవ, సంస్కృతీ, సాహిత్య రంగాల అభివృద్దికి పాటు పడదాం.

మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి మన సమాజంలోని సభ్యులకు, తోటి వారికి ఎదురయ్యేసమస్యల నుంచి బయటపడేందుకు ఉమ్మడిగా కృషి చేద్దాం. అలాగే మన నైటా ఉనికిని కాపాడుతూ, అభివృద్ది చేస్తూనే, కలిసి వచ్చే స్థానిక ఇతర జాతీయ సంఘాలతో నమన్వయం చేసుకుంటూ ముందకు వెళ్దాం. నైటా వేదికగా నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో మీ అందరి సహకారం, భాగస్వామ్యాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, నాతో పాటు కొత్త కార్యవర్గాన్ని ప్రోత్సహించి చేపట్టిన ప్రతీ ఈవెంట్‌లో పాల్గొని విజయవంతం చేసుకుందాం. ఆదర్శంగా నిలుద్దాం.ఇందుకోసం సొసైటీ పెద్దలు, దాతలు, నైటా సమాజం హితాన్ని ఆకాంక్షించే అందరి తోడ్పాటును కోరుకుంటున్నా.

శుభాకాంక్షలతో…. మీ…

వాణి రెడ్డి ఏనుగు
అధ్యక్షురాలు మరియు కార్యవర్గ సభ్యురాలు 2025
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA)

Our Souvenir