President Message 2023

Sunil Reddy Gaddam
NYTTA President,
Karya Varga Sabhyulu - 2023.

Dear Friends,

Greetings to all members of the New York Telangana Telugu Association. Wishing everyone a happy New Year and prosperous Sankranti. I am honored to serve as the president of New York Telangana Telugu Association ( NYTTA ) for the year 2023. I am committed to promoting Telangana culture and traditions, organizing programs to enrich the knowledge of students and children, youth, men and women alike and highlighting the distinctiveness and the splendor and grandeur of our motherland.

My main goal is to uphold the responsibilities of the president position, steer the New York Telangana Telugu Association towards its key objectives. I am dedicated to fulfill our community’s mission by collaborating with local and national organizations in service programs.

We aim to establish a strong presence in all our endeavors, with unwavering support from our Telugu community. Trusting in our collective strength, I am confident that we will successfully execute our programs and achieve victory in every undertaking. My motto as president of NYTTA is to inspire and instill core Telangana culture and to pass on deep seated values in kids, youth and all connoisseurs of Telangana and Telugu language.

Thanks and Regards
Sunil Reddy Gaddam
President 2023
New York Telangana Telugu Association

అందరికి నమస్కారం,

నా పేరు సునీల్ రెడ్డి గడ్డం ఇటీవలే న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘానికి 3 వ అధ్యక్షుడి గా బాధ్యతలు స్వీకరించాను. సంస్థ ఆశయాల సాధనకు ఈ నూతన సంవత్సరం ఒక చక్కని అవకాశం. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం సభ్యులకు, శ్రేయోభిలాషులకు, పెద్దలకు మరియు దాతలకు నా నమస్కారములు, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు…

తెలంగాణ సంస్కృతి, చరిత్ర, కళలు, మరియు మన జన్మభూమిని మర్చిపోకుండా, ఘనమైన చారిత్రాత్మక, సాహిత్య, వారసత్వ సంపదను భావితరాలకు అందించడానికి ఏర్పడిన ఈ సంస్థ యొక్క ధ్యేయాల్ని ముందుకు తీసుకుపోయేలా శాయశక్తుల కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను.

నా ఈ అధ్యక్ష బాధ్యతని, నా సహచర కార్యవర్గ సభ్యుల సహాయ సహకారాలతో, విశిష్టమైన తెలంగాణా సౌరభం ఉట్టిపడేలా మహిళలకు, యువతకు, పిల్లలకు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమాలతోపాటు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ, మన స్థానిక, జాతీయ తెలుగు సంఘాలతో కలిసి పని చేస్తూ, ఈ సంఘం యొక్క ఉనికిని, ప్రత్యేకతని, కాపాడుతూ, మన తెలుగు ప్రజలందరం ఒక్కటేనని చాటుతూ, మంచి మంచి సాహితీ మరియు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతూ మీ అందరి ఆదరాభిమానముల పొందటానికి శాయశక్తుల కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను.

ఈ 2023 సంవత్సరంలో మేము నిర్వహించే ప్రతి కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలని మా ఆత్మీయ ఆహ్వానం అందిస్తున్నాము. మా కార్యవర్గానికి అప్పగించిన గురుతర బాధ్యతను, మేమందరము కలిసి రాగద్వేషాలకు అతీతంగా త్రికరణ శుద్ధితో నిర్వహిస్తామని ప్రమాణం చేస్తున్నాము. ఈ సంఘం విజయవంతంగా నడవడానికి సహకరించే ప్రతి సభ్యునికి, దాతలకు ధన్యవాదములు తెలియచేస్తూ, ఈ సంఘ ముఖ్య లక్ష్యాలైన సేవ, సంస్కృతి మరియు సాహిత్య రంగాలలో పురోభివృద్ధి సాధనలో మీ అందరి సహాయ సహాకారాలు మా 2023 నూతన కార్యవర్గానికి కూడా అందిస్తారని అభ్యర్థిస్తున్నాను.

భవదీయుడు

సునీల్ రెడ్డి గడ్డం

నూతన అధ్యక్షుడు మరియు కార్యవర్గ సభ్యులు 2023

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA)

Sunil Reddy Gaddam
NYTTA President,
Karya Varga Sabhyulu - 2023.

అందరికి నమస్కారం,

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం సభ్యులకు మరియు శ్రేయోభిలాషులకు నమస్కారము. మా నూతన కార్యవర్గ బృందం 2023 తరపున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.

సంస్థ స్థాపించబడిన రెండవ సంవత్సరములోనే సంఘం అధ్యక్షునిగా నన్ను ఎన్నుకొని నామీద ఉంచిన ఈ గురుతర బాధ్యతను నాకు కలిగిన అదృష్టంగా భావిస్తూ నా సహచర కార్యవర్గ సభ్యుల సహాయ సహాకారాలలో మీ అందరి ఆదరాభిమానముల పొందటానికి శాయశక్తుల కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను.

తెలంగాణ చరిత్ర, కళలు, సంస్కృతిని కాపాడుకుంటూ ఈ వారసత్వ సంపదను భవిష్యత్తు తరాలకు అందించాలనే సంకల్పంతో స్థాపించబడిన ఈ సంస్థ యొక్క ధ్యేయాల్ని ముందుకు తీసుకుపోయేలా తదనుగుణంగా మంచి మంచి కార్యక్రమములతో ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను.

ఏ కార్యక్రమమైనా విజయవంతంగా జరగటానికి అంగబలం, అర్థబలం రెండూ అవసరం. సంస్థ స్థాపన నుండి సహృదయంతో ఆర్ధిక సహాయం అందించిన దాతలందరికి ప్రత్యేక ధన్యవాదములు. అలాగే మీ యెక్క సహాయ సహాకారాలు మా 2023 నూతన కార్యవర్గానికి కూడా అందిస్తారని ఆశిస్తున్నాము.

మీ
సునీల్ రెడ్డి గడ్డం
అధ్యక్షులు మరియు
కార్యవర్గ సభ్యులు 2023