President Message 2022

Ravinder Kumar Kamtam
NYTTA President,
Karya Varga Sabhyulu - 2022.

అందరికి నమస్కారం,

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం సభ్యులకు మరియు శ్రేయోభిలాషులకు నమస్కారము. మా నూతన కార్యవర్గ బృందం 2022 తరపున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.

సంస్థ స్థాపించబడిన రెండవ సంవత్సరములోనే సంఘం అధ్యక్షునిగా నన్ను ఎన్నుకొని నామీద ఉంచిన ఈ గురుతర బాధ్యతను నాకు కలిగిన అదృష్టంగా భావిస్తూ నా సహచర కార్యవర్గ సభ్యుల సహాయ సహాకారాలలో మీ అందరి ఆదరాభిమానముల పొందటానికి శాయశక్తుల కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను.

తెలంగాణ చరిత్ర, కళలు, సంస్కృతిని కాపాడుకుంటూ ఈ వారసత్వ సంపదను భవిష్యత్తు తరాలకు అందించాలనే సంకల్పంతో స్థాపించబడిన ఈ సంస్థ యొక్క ధ్యేయాల్ని ముందుకు తీసుకుపోయేలా తదనుగుణంగా మంచి మంచి కార్యక్రమములతో ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను.

ఏ కార్యక్రమమైనా విజయవంతంగా జరగటానికి అంగబలం, అర్థబలం రెండూ అవసరం. సంస్థ స్థాపన నుండి సహృదయంతో ఆర్ధిక సహాయం అందించిన దాతలందరికి ప్రత్యేక ధన్యవాదములు. అలాగే మీ యెక్క సహాయ సహాకారాలు మా 2022 నూతన కార్యవర్గానికి కూడా అందిస్తారని ఆశిస్తున్నాము.

మీ
రవీందర్ కుమార్ కంటం
అధ్యక్షులు మరియు
కార్యవర్గ సభ్యులు 2022